Header Banner

6 హిట్లు, 10 ఫ్లాపులతో స్టార్ హీరోయిన్ అయిన నటి! ఆ తప్పు చేసి అడ్రెస్ లేకుండా పోయింది!

  Sat Feb 15, 2025 09:00        Entertainment

ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో దర్శక నిర్మాతలు చాలా సెంటిమెంట్లు పెట్టుకుంటారు. ఒక్కసారి ఫ్లాప్ పడితే హీరోయిన్ కెరీర్ లో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అదృష్టం కొద్దీ కెరీర్ బిగినింగ్ లోనే హిట్ చిత్రం దక్కితే ఆ హీరోయిన్ కెరీర్ ఎక్కవ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. ఒక్కసారి క్రేజ్ వచ్చాక ఫ్లాపులు పడ్డప్పటికీ పెద్దగా నష్టం ఉండదు. క్రేజీ హీరోయిన్ ఇలియానా విషయంలో ఇదే జరిగింది. ఇలియానాని దేవదాసు చిత్రంతో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి పరిచయం చేశారు. తొలి చిత్రంలోనే ఇలియానా గ్లామర్ షో చేసింది. పైగా ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ దర్శకుల చూపు ఆమెపై పడింది. దేవదాసు చిత్రం ఆమెని ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ఆ వెంటనే నటించిన చిత్రం మాత్రం ఇలియానా సినీ జీవితాన్నే మార్చేసింది. ఆ మూవీ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూరి జగన్నాధ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన పోకిరి చిత్రం అది. పోకిరి చిత్రం తర్వాత ఇలియానా క్రేజ్ ఎంతలా వ్యాపించింది అంటే వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అప్పటి వరకు టాలీవుడ్ లో కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరూ లేరు. ఆ రికార్డు ఇలియానాకి మాత్రమే దక్కింది.

 

ఇది కూడా చదవండి: ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా? దాదాపు 5 వేల కోట్ల పైనే బిజినెస్!

 

అప్పట్లో హీరోయిన్ కి కోటి రూపాయల పారితోషికం అంటే మాటలు కాదు. అయినా ఇలియానా డేట్ల కోసం నిర్మాతలు ఎగబడేవారు. అంత క్రేజ్ సాధించిన ఇలియానాకి టాలీవుడ్ లో 50 శాతం విజయాలు కూడా లేవు. తెలుగులో ఇలియానా మొత్తం 16 చిత్రాల్లో నటించింది. అందులో హిట్ అయిన చిత్రాలు 6 మాత్రమే. మిగిలిన 10 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ ఇలియానాకి యువతలో ఉన్న క్రేజ్ తో ఆమెని దర్శక నిర్మాతలు కొనసాగించారు. టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న టైంలోనే ఇలియానా పెద్ద తప్పు చేసింది. బాలీవుడ్ పై వ్యామోహంతో టాలీవుడ్ చిత్రాలని వదిలేసింది. కానీ బాలీవుడ్ లో ఆమెకి ఏమాత్రం కలసి రాలేదు. పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఇంతలో టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మొత్తం పోయింది. ఆ సమయంలో ఇలియానా పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. ఓ వ్యక్తితో బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది. దీనితో ఆమెకి అవకాశాలు ఇచ్చే నిర్మాతలు కరువయ్యారు. అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది కానీ వర్కౌట్ కాలేదు.ఇలియానా తెలుగులో నటించిన చిత్రాల్లో దేవదాసు, పోకిరి, ఆట, జల్సా, కిక్, జులాయి చిత్రాలు విజయం సాధించాయి. 

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

 

ఇలాంటి నీచుడిని ఏమి చేయాలి? తలపై కత్తితో పొడిచి.. నోట్లో యాసిడ్ పోసి.. ఆ తర్వాత అత్యాచారం - ఏపీలో షాకింగ్ సంఘటన!

 

వాలంటైన్స్ డే.. ముసలోడి ప్రేమ ముదిరిపోయిందిగా.. దివ్వెల‌.. దువ్వాడ.. ఈ ప్రేమ‌జంట‌ వీడియోపై ఓ లుక్కేయండి!

 

వైసీపీ నేతల్లో పెరిగిన టెన్షన్.. వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం.. 88 మందిపై పోలీసులు కేసు నమోదు!

 

మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!

 

ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!

 

ప‌వ‌న్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని తాను కూడా అల‌వాటు చేసుకోవాల‌న్న హీరోయిన్‌! సోషల్ మీడియా లో వైరల్!

 

శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tollywood #ileana #ViralNews